
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారతీయుల్లో వందేమాతర గీతం దేశభక్తి స్పూర్తిని నింపిందని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. వందేమాతర గీతం వ్రాసి 150 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బంది వందేమాతర గీతం ఆలపించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చి, సామాన్యులనూ సమరయోధులుగా మార్చిందన్నారు. వందేమాతర గీతం భారతీయులలో జాతియతను నింపి, స్వాతంత్య్రి కాంక్షను నింపిందన్నారు. ఈ గేయాన్ని బకించంద్ర చటర్జీ 1875 ఆనంద్ మఠం అనే నవలలో వ్రాశారని, నేటికి ఈ గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సి.హెచ్ శ్రీనివాస్, బి. శ్రీనివాసరావు, మేనేజర్ బాలాజీ బాష, సుపెరింటేన్దేంట్లు, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.







