
గుంటూరు అభివృద్ధిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఫల్యం చెందారని బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి జేఏసీ ప్రతినిధులు ఆరోపించారు. సాక్షాత్తు అధికారులు కేంద్ర మంత్రిని తప్పుదారి పట్టించారని చెప్పారు. జేఏసీ ప్రతినిధులు వల్లూరు శివప్రసాద్, ఎల్. భారవి గుంటూరులో మంగళవారం మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో హైకోర్టు స్పందించి అడ్వకేట్ కమీషన్ ను ఏర్పాటు చేయడం పాలకుల వైఫల్యాని నిదర్శనం అని అన్నారు. అకస్మాత్తుగా బ్రిడ్జిని కూల్చి వేసి అధికారులు కోర్టు ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించి గుంటూరులోని అన్ని వర్గాలతో చర్చించి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ ఆర్డర్ ప్రకారం రహదారి విస్తరణ, భూ సేకరణ చేయాలని సూచించారు. అదేవిధంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.







