
GUNTUR:-క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. పాస్టర్లు, చర్చీలు, క్రైస్తవుల రక్షణ కోరుతూ ఛలో కలెక్టరేట్ పేరుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలిండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రాజసుందర బాబు మాట్లాడారు. క్రైస్తవులు, చర్చీలు, పాస్టర్ల, సువర్తికుల, దైవ సేవకుల రక్షణ కొరకు ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించాలి.
జాప్యం లేకుండా క్రైస్తవ సమాధుల కోసం స్థలాలు కేటాయించి, క్రైస్తవ సమాధి తోటలు ఏర్పాటు చేసి సమాధి తోటల్లో ఇంటర్నల్ రోడ్లు ప్రార్థన మందిరం నిర్మించాలి. గ్రామీణ ప్రాంతాల్లో క్రైస్తవ సమాధి తోటలకు చుట్టూ ప్రహరి గోడలు ఏర్పాటు చేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26, 27, 28 లను పటిష్టంగా అమలు చేయడానికి రూల్స్ రూపొందించి, మతసామరసాన్ని కాపాడాలి.. పాస్టర్లకు గౌరవ వేతనంగా రూ.25,000/- మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.







