
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా బిజెపి రాష్ట్ర మీడియా కోకన్వీనర్ వెలగలేటి గంగాధర్ విజయవాడ గొల్లపూడి లోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయం నందు కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘాలను కలుపుకొని బ్రాహ్మణుల అభ్యున్నతికి తోడ్పడుతానని కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా పథకాల ద్వారా యువతకు సంక్షేమ స్వయం ఉపాధి పథకాలు, మహిళలకు గ్రూప్ లోన్స్ స్వయం ఉపాధి పథకాలు అందే విధంగా కృషి చేస్తానని బ్రాహ్మణ కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తానని తెలిపారు. నాకు ఈ అవకాశం కల్పించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి బిజెపి సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మరియు రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎండి దొరబాబు మేనేజర్ శ్రీనివాస్ కార్పొరేషన్, క్రెడిట్ సొసైటీ అధికారులు బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ బిజెపి రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్, దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాలకమండలి సభ్యులు అవ్వారు బుల్లబ్బాయి, పిట్టల గోవిందా, జనసేన జిల్లా కార్యదర్శి ఫణిశర్మ, శ్రీధర్ బాబు, ఈమని మాధవరెడ్డి, తాడువాయి రామకృష్ణ, వాసా పల్లపరాజు, శంకరప్రసాద్, తారక రామారావు, జంధ్యాల సాయిరాధాకృష్ణ, ప్రతాప ప్రసాదు, మధు తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.







