
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి మీటర్లు కల్గిన కమర్షియల్ సంస్థలు, అపార్ట్మెంట్ వాసులు రానున్న 3 రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే ట్యాప్ కనెక్షన్లు తొలగిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో జిఎంసి త్రాగునీటి మీటర్లు కల్గిన కమర్షియల్ సంస్థలు, అపార్ట్మెంట్ వాసులు నిర్దేశిత మీటర్ చార్జీలు చెల్లించడంలేదని, ఇప్పటికే షుమారు రూ.29 కోట్లు బకాయిలు ఉన్నాయని, 3 రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే ట్యాప్ కనెక్షన్ లు తొలగిస్తామని తెలిపారు. ఇప్పటికే వార్డ్ ల వారీగా సచివాలయ కార్యదర్శుల ద్వారా పలుమార్లు బకాయిలు చెల్లించాలని తెలియచేసినా స్పందిచక పోవడం వలన ట్యాప్ లను డిస్ కనెక్షన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.







