
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 24వ డివిజన్ చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మెప్మా ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘సఖి రక్ష – సఖి సురక్ష’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డ్వాక్రా మహిళ ఆరోగ్య భద్రత కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో, 35 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు, 55 ఏళ్ళు పైన వయసున్న మహిళలకు ప్రత్యేకంగా, మూడు రోజులపాటు విస్తృత స్థాయి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. క్యాన్సర్‌లు, రెస్పిరేటరీ సమస్యలు, షుగర్, లైఫ్ స్టైల్ డిసార్డర్స్, ఎనీమియా వంటి మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టి 14 రకాల ముఖ్యమైన హెల్త్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఒక వారం రోజుల్లో ప్రతి మహిళకు వ్యక్తిగత హెల్త్ కార్డు ఇచ్చి, ఏదైనా ఆరోగ్య సమస్యలు కనపడితే నేరుగా ప్రభుత్వం హాస్పిటల్‌కి రిఫర్ చేసి పూర్తి స్థాయి ఫాలోఅప్, చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. అదే విధంగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి మహిళకు ₹5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉండటం ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. డ్వాక్రా మహిళల స్వయం సాధికారత కోసం ఈ పథకం మరో భారీ అడుగుగా నిలుస్తుందని, ప్రతిరోజూ కనీసం 600 మందికి టెస్టులు – ట్రీట్మెంట్లు అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని, ఇప్పటికే సఖి సురక్ష టీంను ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైందని, టెస్టులు చేసిన ప్రతి మహిళకు పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.







