
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఎనిమిదో వారం మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ కు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక సమస్యలతో నియోజకవర్గ కార్యాలయానికి వచ్చి వినతులు ఎమ్మెల్యే గళ్ళా మాధవికి అందజేశారు. పెన్షన్ సమస్యలు, పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ఇబ్బందులు, ఈవ్ టీజింగ్ సమస్యలు, ప్రాంతీయ అభివృద్ధి అవసరాలు, ఉద్యోగ కల్పన, మహిళా ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు వంటి అనేక అంశాలు ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. ప్రభుత్వ విధాన పరిధిలో ఉన్న సమస్యలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీ ఇచ్చారు. ఇతర సమస్యలను డీటైల్డ్‌గా ఆన్ లైన్ లో నమోదు చేసి, ఫాలోఅప్ చేస్తూ పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిసున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ప్రతి మహిళకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను అండగా ఉంటానని, మహిళలకు తాను ఉన్నాననే భరోసా కల్పించడమే తన లక్ష్యమని గళ్ళా మాధవి స్పష్టం చేశారు. మహిళలు ఎలాంటి బాధలు, ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించేందుకు మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తూ, సమస్యలు పూర్తిగా పరిష్కరయ్యే వరకు తాను శ్రమిస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీనిచ్చారు.







