
యువత గ్రీన్ స్కిల్స్ పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా “పర్యావరణంలో అవకాశాలు” (Opportunities in Environment) అనే థీమ్ తో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం వివిధ సంస్థలు, విద్యా సంస్థలు ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు, నగర పాలక సంస్థ కమిషనర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల ఒక థీమ్ తో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల “పర్యావరణంలో అవకాశాలు” థీమ్ తో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రదర్శనలో విద్యార్థులు మంచి ఆలోచనలతో వచ్చారని అభినందించారు. క్లిష్టమైన వాటిని సులభంగా పరిష్కరించే మార్గాలను చూపించారని పేర్కొన్నారు. గ్రీన్ స్కిల్స్, గ్రీన్ అవకాశాలు (opportunities) పై అవగాహన పెంచుకోవాలని కోరారు. రెన్యువబుల్ ఎనర్జీ పై ముఖ్యమంత్రి దృష్టి సారించారని, సూర్య ఘర్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఇ – వేస్ట్ భవిష్యత్తులో పెద్ద సమస్యగా తయారు అవుతుందని, అటువంటి వాటిని రీ సైక్లింగ్ చేయడం అత్యవస్యమని అన్నారు. వి.వి.ఐ.టి విద్యార్థులు రీ సైక్లింగ్ పై వినూత్న ఆలోచనలతో రావడం ముదావహం అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఏ కోర్సు లలో ఎక్కువ గిరాకీ ఉంటుందో వాటిపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్య మంత్రి ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త (One family one entreptrenuer) విధానం తీసుకువచ్చారని వివరించారు. మహిళలు లాక్ పతి దిదిలుగా ఎదుగుతున్నారని చెప్పారు. పారిశ్రామిక రంగంలో 25 కొత్త పాలసీలు ముఖ్య మంత్రి తీసుకువచ్చారని చెప్పారు. స్వర్ణ ఆంధ్రా 2047 విజన్ ప్రణాళికలో అనేక వినూత్న ఆలోచనలు చేయడం జరిగిందని అన్నారు. పర్యావరణ హిత విధానాన్ని (ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ) కాపాడాలన్నారు. జిల్లాలో అత్యధిక సంఖ్యలో లాక్ పతి దిదిలు రావాలని ఆకాక్షించారు. శాసన సభ్యులు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ పర్యావరణం జీవితంలో అతి ముఖ్యమైనదన్నారు.పర్యావరణ పరిరక్షణ చేయాలని చెప్పారు. ఇండోర్ వంటి నగరాల్లో వృథా పదార్థాల నుండి బయో ఇంధనం తయారు చేస్తున్నారని తెలిపారు. నాగపూర్ లో నితిన్ గడ్కారీ వేస్ట్ వాటర్ ను పునః ఉపయోగిత దిశగా మలచి తద్వారా రూ. 51 కోట్లు కార్పొరేషన్ కు ఆదాయం వచ్చే విధంగా చేశారని తెలిపారు. ప్లాస్టిక్ వేస్ట్ రీ సైక్లింగ్ చేయాలని, వాటిని రహదారుల నిర్మాణం, నిర్వహణకు వినియోగించుకోవడం పై దృష్టి పెట్టాలని తెలిపారు. “పర్యావరణం మన అందరిది… తల్లిగా కాపాడుకోవాలి” అని పిలుపునిచ్చారు. గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణంలో అవకాశాలుపై ప్రభుత్వం, బ్యాంకులు, సాంకేతిక సంస్థలు ఇచ్చే సహకారం అందిపుచ్చుకొని విజయవంతం కావాలన్నారు. గుంటూరు పట్టణంలో ప్రతి ఇంటి నుండి ప్రారంభం కావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. చెత్త నుండి సంపద తయారీపై పెద్ద ఎత్తున దృష్టి సారించాలని సూచించారు. “పర్యావరణంలో అవకాశాలు” థీమ్ లో భాగంగా పర్యావరణ రంగంలో స్వయం ఉపాధి, వ్యాపారోత్పత్తి, వినూత్నతను ప్రోత్సహించడం, ఎం.ఎస్.ఎం.ఇ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ భాగస్వాములతో కలిసి ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవగాహన శిబిరాలు, యువత, స్వయం సహాయక సంఘాలు (SHGs), పారిశుధ్య కార్మికులు, ఘన, ద్రవ వ్యర్థ నిర్వహణ వ్యాపార అవకాశాలపై నైపుణ్యాభివృద్ధి శిక్షణా వర్క్‌షాప్‌లు, ఆర్థిక సహాయ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయడం, స్వయం సహాయక సంఘాలు, స్టార్టప్స్, స్థానిక వ్యాపారులు తయారు చేసిన రీసైకిల్, అప్‌సైకిల్, పర్యావరణ హిత ఉత్పత్తుల ప్రదర్శనలు, బయోగ్యాస్ ప్లాంట్లు, బయోఎంజైమ్ తయారీ, కంపోస్టర్లు, రీసైకిల్ టైల్స్, ఫ్యూయల్ బ్రిక్వెట్స్ వంటి డీసెంట్రలైజ్డ్ వేస్ట్-టు-వెల్త్ సాంకేతికతల ప్రదర్శనలు, తక్కువ ఖర్చుతో గాలి నాణ్యత మానిటరింగ్ పరికరాలు, ఈవీ సేవలు వంటి పునరుత్పాదక శక్తి, గ్రీన్ మొబిలిటీ స్టార్టప్స్, ఉత్తమ రీసైకిల్ క్రాఫ్ట్స్, అప్‌సైకిల్ డెకర్, పాఠశాల స్థాయి ఎకో-ఎంట్రప్రెన్యూర్ ఛాలెంజ్, పర్యావరణ హిత ఉత్పత్తుల మార్కెట్లు, కంపోస్ట్ అమ్మకాలను రైతులు, నర్సరీలు, పౌర సమూహాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్ సమత, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి. నజీనా బేగం, జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు ఇన్ ఛార్జ్ జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు డి.దుర్గా భాయి, నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుందరరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







