
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అగ్ర తాంబూలమిస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. బుధవారం స్థానిక తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో రూ.1.58 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గుంటూర తూర్పు నియోజకవర్గానికి చెందిన మేకా శాంతకుమారి, తమన్నా సుజాత, గుంటి సంధ్యారాణి అనారోగ్యానికి గురై ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందారు. వీరు నిరుపేదలు కావడంతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా చెక్కులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ పేదల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తున్నామని వెల్లడించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.7 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ అందించామని తెలిపారు.
Nandha Jyothiఏ ఒక్కరికీ వైద్య సేవలు దూరం కాకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. వైద్య రంగానికి వేల కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి సంజీవనిగా ఉన్న గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో అన్ని విభాగాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం, దాతల సాయంతో ఆధునిక పరికరాలను సమకూర్చామని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ సమయంలోనైనా ప్రజలు తనను సంప్రదించవచ్చని సూచించారు.







