
గుంటూరు పరిధిలోని గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కన్నుల పండువగా సాగింది. పవిత్ర కార్తీక మాసం, ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ వ్రతం చేపట్టారు. 600 జంటలు ఈ వ్రతంలో పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ నడుమ భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం సాగింది. కార్తీక మాస పూజలో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేపట్టే కార్యక్రమాలు గురించి ఆలయ కమిటీ ప్రతినిధులు ఆంజనేయులు, ధనలక్ష్మి మీడియాకు వెల్లడించారు.







