
గుంటూరులో జరుగుతున్న శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి పనులపై హైకోర్టు స్పందించింది. బాధితులకు సరైన పరిహారం ఇవ్వకుండా బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారంటూ జేఏసీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం అడ్వకేట్ కమిషనర్‌ను హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ బృందం ఆదివారం ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించింది. బ్రిడ్జి నిర్మాణం, స్థానిక వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే శంకర్ ఓవర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో కొంతమంది పనిగట్టుకుని అపోహలు సృష్టిస్తున్నారని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ఓవర్ బ్రిడ్జి విస్తరణ విషయంలో వ్యాపారులకు సరైన రీతిలో నష్టపరిహారం, టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. లాయర్లు తమ ఫీజుల కోసమే కోర్టులో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని చెప్పారు.







