
గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘ఏక్ థా దివస్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు సమైక్యత ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషిని స్మరిస్తూ, ఆయన బాటలో నడుస్తూ పోలీస్ శాఖ సమష్టిగా ప్రజలకు రక్షణ కల్పిస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి నగరంపాలెం వరకు ప్రదర్శన సాగింది.







