
గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ఇరువురు సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది.ఈ దాడిలో ఇద్దరు బెట్టింగ్ నిర్వాహకులు, నలుగురు బెట్టింగ్ కట్టే వారిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు తాతినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆన్ లైన్ లో ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారి వద్ద నుండి 13 లక్షల 60 వేల నగదు, ల్యాప్ టాప్, 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.శ్రీనివాస్ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి PEACH EXCH అనే యాప్ ద్వారా బెట్టింగ్ లను నిర్వహిస్తున్నాడుని చెప్పారు.







