
గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులతో పాటు వినియోగిస్తున్న 10 మందిని పెదకాకాని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల నుండి 4.95 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ముత్యాల రమణారావు అరకు ప్రాంతం నుండి గంజాయి తీసుకొచ్చి పెదకాకానిలో విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా గుంటూరును తీర్చిదిద్దడం కోసం 12 ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పారు.







