
ఇళ్లలో చోరీలకు పాల్పడే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. దేవరకొండ రాంబాబు, తుపాకుల వెంకటేష్ బొమ్మల విజయ్ అనే పాత నేరస్తులు ఇటీవల మేడికొండూరు వద్ద మా ఇంట్లో చోరీకి పాల్పడినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు విజయవాడ, చిలకలూరిపేటకు చెందిన ముగ్గురు నేరస్థులను అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. నేరాల నియంత్రణకు నిఘాను మరింత పటిష్టం చేస్తామన్నారు. అదేవిధంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు.







