
విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్యశాలను 150 ఎకరాల్లో మంగళగిరిలో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేయించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం మంగళగిరి లోని ఎయిమ్స్ ను ఆయన సందర్శించారు.
ఎయిమ్స్ కు కావలసిన విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా గడిచిన ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం అందించలేకపోయిందని చెప్పారు. 10 ఎకరాల అదనపు స్థలంతో పాటు పవర్, వాటర్ సప్లై టిడిపి అందించడం జరిగింది. 95% పైగా పేషెంట్లు ఇక్కది సేవలు, సౌకర్యాలతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 960 బెడ్స్ కావలసి ఉండగా కేవలం 600 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఐసియులో 96 కావలసి ఉండగా 20 మాత్రమే పడకలు అందుబాటులో ఉన్నాయి. 2 లక్షల 73 వేలకు పైగా పేషెంట్లు ఇక్కడ సేవలు పొందుతున్నారు. మరింత ఎక్కువ మంది పేషెంట్లకు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఫార్మసీ మెడికల్ స్టోర్స్ షార్టేజ్, తక్కువ బస్సులు, బస్సు షెల్టర్లు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక రెండు బస్సులను అందించబోతున్నారు. ఎలక్షన్ కోడ్ ముని గీయగానే ఆ రెండు బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్ పేషెంట్లు కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వారికి ధర్మశాలను మరింత అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టబోతున్నాం. అంబులెన్స్ సర్వీస్ బయట నుంచి వచ్చిన వారికి అధికంగా ఛార్జ్ చేయడంపై చర్యలు తీసుకోబోతున్నాం. చార్జీలు కంటే ఎక్కువ వసూలు చేయకూడదని సూచీ బోర్డులు ఏర్పాటు చేయబోతున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.








