
ప్రత్తిపాడు నియోజకవర్గంలో తుఫాను కారణంగా ఏర్పడిన నష్టం, పరిహారం పంపిణీ పై గుంటూరులో సమీక్షా సమావేశం జరిగింది. జడ్పీ హాల్ లో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. మానవతా దృక్పథంతో నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు.రోడ్డు, భువనాలు, పంచాయితీ రాజ్, వ్యవసాయ, ఉద్యానవనం శాఖలతో సమీక్ష జరిపాం.అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాల్లో పర్యటించాలి. నివేదికలో తక్షణమే అందజేయాలని ఆదేశించాం. 20 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.కోటి రూపాయల నిధులతో రహదారులను అభివృద్ధి చేస్తాం. తుఫాను నష్టం అంచనాలో లోపం లేకుండా చూస్తాం. తుఫాను సమయంలో లక్షా 62 వేల మందికి పునరావాసం కల్పించారు.వారికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో పరిహారం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే రామాంజనేయులు స్పష్టం చేశారు.







