
ప్రత్తిపాడు మండలం కొండ్రుపాడు గ్రామంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం “రచ్చబండ” కార్యక్రమం నిర్వహించారు. వై.యస్.ఆర్ సీ.పీ అధ్యక్షులు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. సంతకాల సేకరణ చేసి, అనంతరం గ్రామ కమిటీలను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో, ప్రత్తిపాడు & తెనాలి నియోజకవర్గ పరిశీలకులు షేక్ గులాం రసూల్, ప్రత్తిపాడు మండల మరియు కొండ్రుపాడు గ్రామ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.







