chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: ఆదర్శ గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలి

GUNTUR COLLECTOR MEETING ON HOUSING SCHEME

ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద గుర్తించిన అన్ని గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఐదు వందలు, ఆపైన జనాభా కలిగిన షెడ్యూల్ కులాల గ్రామాలను ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేయడం జరిగింది. జిల్లాలో 40 గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో అనుసంధానం చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించుటకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షలు చొప్పున నిధులు విడుదల చేస్తుంది. గ్రామాల్లో పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం , విద్యుత్, తాగు నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించుటకు సంకల్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన ఆదర్శ గ్రామాల్లో ముందుగా కనీసం ఐదు గ్రామాల్లో శత శాతం మౌళిక వసతుల కల్పించాలన్నారు. ఇందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, విద్య, వైద్య శాఖలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీ అధికారులు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. కొన్ని గ్రామాలు ఆదర్శవంతంగా తయారు కావడం వలన ఇతర గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని, వివిధ పథకాల క్రింద అనుసంధాన మార్గాలు సులభం అవుతయాని అన్నారు. గ్రామ కమిటీలు గ్రామాల్లో సర్వే నిర్వహించి అవసరాలను గుర్తించాలని ఆదేశించారు. తదనుగుణంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. గ్రామ కమిటీలు గుర్తించిన గ్రామ అవసరాలను జిల్లా స్థాయి కమిటీకి సమర్పించాలని వాటిని జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి ఆమోదముద్ర వేస్తుందన్నారు. గ్రామ కమిటీలు, సంబంధిత శాఖలు వెంటనే ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి యు.చెన్నయ్య,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి,  జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయ లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker