
సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో అందిన ఆర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోగల ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న పి.జి.ఆర్.ఎస్ పై సమీక్షిస్తూ ప్రతీ శాఖకు అందుతున్న అర్జీల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. మొత్తం స్వీకరించిన అర్జీలు, పరిష్కరించిన అర్జీలు, పరిష్కరించాల్సిన అర్జీలుపై పక్కా సమాచారం ఉండాలని ఆదేశించారు. ఆన్ లైన్ లో వచ్చిన అర్జీలలో ఇంకా చూడాల్సిన అర్జీలు ఎన్ని ఉన్నాయి, ఎందుకు జాప్యం జరిగిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు. కొన్ని సమస్యలు మరల వస్తున్నాయని (రీ ఓపెన్), వాటికి స్పష్టమైన పరిష్కారం చూపకపోవడం వలన అలా జరుగుతున్నాయని భావించాల్సి ఉంటుందని చెప్పారు. మరల వచ్చిన అర్జీలలో పెండింగ్ ఉండటానికి కారణాలు వివరణాత్మకంగా సమర్పించాలని ఆదేశించారు. ప్రతి అర్జీ పై ఆడిట్ పక్కాగా జరగాలని అన్నారు. శాఖల వారీగా, మండలాల వారీగా విశ్లేషణ*ఎక్కువ సంఖ్యలో సమస్యల పరిష్కారానికి అందుతున్న అర్జీలు ఆధారంగా శాఖలు వారిగా, మండలాల వారీగా విశ్లేషణ చేస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. ఆయా శాఖలు, మండలాల్లోనే ఎక్కువ సమస్యలు రావడానికి కారణాలు, సంబంధిత శాఖలు, మండలాల పనితీరు విశ్లేషణ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. శాఖల్లో పనితీరు మెరుగు పరచుకుని సమస్యల పరిష్కారంలో ముందంజ వేయాలని పేర్కొన్నారు. పి.జి.ఆర్.ఎస్ లో …. అర్జీలు అందగా వాటిలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి. గుంటూరు నగరపాలెంకు చెందిన బి.సౌజన్య డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్టు ఫలితాలు త్వరగా విడుదల చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆర్జీని సమర్పించారు. గుంటూరు మారుతి నగర్ కు చెందిన కె.రమణయ్య పింఛను మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. పొన్నూరు మండలం చింతలపూడి గ్రామానికి చెందిన మారుపూడి భూషణ చౌదరి తనకు రహదారులు భవనాల శాఖ నుండి రావలసిన నష్టపరిహారాన్ని ఇప్పించాలని వినతి పత్రం Electrician. ప్రత్తిపాడు మండలం పెద గొట్టిపాడుకు చెందిన ఎన్.రాజేష్ వినతి పత్రం సమర్పిస్తూ వర్షాలు కురిసే సమయంలోమురుగు కాలువలలో నీరు ఇళ్లలోకి వస్తుందని, దీనికి తగిన పరిష్కారం ఇప్పుడే చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిరంగిపురం మండలం గరుడాచల పాలెంకు చెందిన గాజుల శ్రీనివాస రావు వినతి పత్రం సమర్పిస్తూ పెండ్లి సర్టిఫికెట్ ఇప్పించాల్సిందిగా కోరారు. తాడికొండ మండలం లామ్ కు చెందిన షేక్ సలీం మండల సర్వేయర్ జారీ చేసిన ధృవీకరణ పత్రం ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ ఆర్జీని సమర్పించారు. గుంటూరు నగరంపాలెంకు చెందిన జీ.జఅగన్నాథ రావు తన భూమిని కొంత ఆక్రమణలు చేశారని, దానిని తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మి కుమారి, శ్రీనివాస్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయ లక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.దుర్గా భాయి, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండా సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.







