
ఇందన వనరుల పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. జాతీయ ఇందన వనరుల పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని మంగళవారం కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారీయా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తో కలసి ప్రారంభించారు. ఇందన పరిరక్షణ , పొదుపు చిట్కాల ప్రచార పోస్టర్లును ఆవిష్కరించి, ఇందన వనరులను పొదుపు పాటిస్తామని, వృధాను అరికడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందన వనరుల పొదుపు పాటించటం వలన భవిష్యత్తు తరాలకు ఇందన భద్రత భరోసా కల్పించటం సాధ్యం అవుతుందన్నారు. విద్యుత్ ను పొదుపుగా వినియోగించటం ద్వారా విద్యుత్ ఉత్పత్తి వలన వచ్చే కార్భన ఉద్గారకాలను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. ఇందన వనరుల ఉత్పత్తిని తగ్గించటం వలన వీటికి వినియోగించే బొగ్గు, గ్యాస్, క్రూడ్ అయిల్ వంటి శిలాజ ఇందనాలు, సహజ వనరులను కాపాడుకోవచ్చని వివరించారు. జాతీయ ఇందన వనరుల వారోత్సవాలు ప్రతి సంవత్సరం డిసెంబరు 14వ తేది నుంచి 20 వ తేది వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. వారోత్సవాలలో విద్యుత్ వంటి ఇందన వనరులను వృధా చేయకుండా పొదుపుగా వినియోగించటం పై ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విధ్యార్ధులకు, యువతకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటం జరుగుతుందన్నారు. కార్యాలయాలతో పాటు, ఇంటిలోను అవసరం లేనప్పుడు తప్పనిసరిగా లైట్లు, ఫ్యాన్లు ఆపివేయాలన్నారు. విద్యుత్ తక్కువుగా వినియోగించే స్టార్ రేటింగ్ ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను, ఇతర ఉపకరణాలను మాత్రమే వినియోగించాలన్నారు. సోలార్ వంటి పునరాత్పక ఇందన వనరుల వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యతతో ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు రూఫ్ టాప్ సోలార్ పధకం ద్వారా రాయితీలు అందిస్తున్నారని చెప్పారు. విద్యుత్ పొదుపు చేయటంలోను ,వృధాను అరికట్టడంలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రజల్లో మార్పు రావాలని ఆకాక్షించారు. ఎనర్జీ ఎఫిషియన్స్ లో దేశంలోనే రాష్ట్రం అవార్డు సాధించందని, ఇదే స్పూర్తిని కోనసాగించాలన్నారు. ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, సీపీడీసీఎల్ ఎస్ఈ చల్లా రమేష్, సీఆర్డఏ సర్కిల్ ఎస్ఈ ఎం శ్రీనివాసరావు, ఈఈ కే సత్యనారాయణ, డీఈలు శ్రీనివాసబాబు, నాగేశ్వరరావు, జె హరిబాబు , సూర్యప్రకాష్, ఎస్ఏఓ రామిరెడ్డి, ఏడీఈలు బి రాజమోహనరావు, ఎన్ గురవయ్య, ముస్తాక్ అహ్మద్, జి సురేష్ బాబు, రమేష్, కే సాంబశివరావు, సీపీడీసీఎల్, సీఆర్డీఏ సర్కిల్ ఉద్యోగులు పాల్గొన్నారు.







