
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (International Day of Persons with Disabilities) సందర్భంగా శనివారం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు డి దుర్గా భాయి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, “సామాజిక పురోగతికి వికలాంగులకు సమగ్ర సమాజం నిర్మాణం” అనే థీమ్‌తో డిసెంబరు 3వ తేదీన దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా ఎన్.టి.ఆర్ స్టేడియంలో ఈ నెల 29వ తేదీన జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖల దివ్యంగ ఉద్యోగులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. వికలాంగుల క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు, వారి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించేందుకు, సమాజంలో సమానత్వ భావనను పెంపొందించేందుకు ముఖ్య పాత్ర పోషించే ఈ పోటీల్లో తమ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొనే విధంగాజిల్లాలో గల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.







