chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: ఎన్.టి.ఆర్ భరోసా పించన్లు పంపిణీ చేసిన కలెక్టర్

PENSIONS DISTRIBUTION IN GUNTUR DISTRICT

ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పంపిణీ చేశారు. పించన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణంలో టిడ్కో కాలనీలో బుధవారం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వివిధ విభాగాల పింఛనుదారులకు పంపిణీ చేశారు. వారితో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను అందిస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో మొత్తం 2,56,904 మంది పింఛనుదారులకు రూ. 111.34 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, మెప్మా, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, గ్రామ వార్డు సచివాలయ అధికారులు, సిబ్బంది ఇందులో నిమగ్నం అయ్యారని తెలిపారు. మొత్తం పింఛన్లలో వృద్ధాప్యపు పింఛన్లు 1,18,174., వితంతువులు 70,112., చేనేతకారులు 3,862., గీతకార్మికులు 443., మత్స్యకారులు 570., ఒంటరి మహిళలు 11,330., చర్మకారులు 876., హిజ్రాలు 67., హెచ్.ఐ.వి బాధితులు 2,614., కళాకారులు 77., డప్పు కళాకారులు 854., దివ్యాంగులు 24,835., వైద్య సంబంధిత పింఛనుదారులు 1667., సైనిక సంక్షేమం 28., అభయహస్తం 3,994., అమరావతి భూముల సంబంధిత 17,401 పింఛన్లు పంపిణీ జరుగుతుందన్నారు. బుధవారం ఉదయం నుండి పంపిణీ జరుగుతుందని, బుధవారం తీసుకోలేని వారికి శుక్రవారం పంపిణీ జరుగుతుందని ఆమె చెప్పారు. ముఖాముఖిలో భాగంగా స్థానికంగా మౌలికసదుపాయాలు కొరత ఉందని, మురుగు నీరు రహదారులపై నిలువ ఉంటుందని, కుక్కలు బెడద ఉందని స్థానికులు తెలియజేయగా సంబంధిత అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు. సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్స్ పై ప్రజల్లో అవగాహన, అధికారులు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రభావం వలన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున మరగ కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker