
ట్రైబల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. పట్టాభిపురంలోఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పదేళ్ల క్రితం రిక్రూట్ అయిన వారు ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ లో ఉండటం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో పనిచేస్తూ 15 వేల జీతంతో సరిపెట్టుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఔట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్టు టీచర్లుగామార్చాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ టీచర్లుగా చేయడానికి అడ్డంకులు ఉంటే…వాటిని అధిగమించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ స్కూల్స్ ఔట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సి. నాగేశ్వరరావు , సెక్రెటరీ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






