
కొత్తపేట సీపీఐ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల ప్రాంతీయ సదస్సు జరిగింది. సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి కార్మికులకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఈ సందర్భంగా AITUC రాష్ట్ర అధ్యక్షుడు వి. రాధాకృష్ణ అన్నారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు పి. సత్యన్నారాయణ, మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.







