
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అరుదైన ఆపరేషన్ జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఏసయ్య అనే పేషెంట్ గుండె జబ్బుతో గత నెలలో ఆసుపత్రిలో చేరారు. సాధారణంగా వయసు పైబడిన వారికి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ వయసు ఉన్న కారణంగా రోగి కుటుంబ సభ్యులు బైపాస్ సర్జరీ చేయించేందుకు ఆసక్తి చూపలేదు. ఈ విషయంలో గుండె జబ్బుల విభాగం వైద్యులు సుదీర్ఘంగా చర్చించి స్టంట్ వేయాలని నిర్ణయించారు. బైఫరగేషన్ టెక్నిక్ ద్వారా రెండు స్టంట్ లు వేసి సర్జరీ విజయవంతం చేశారు. ఈ వివరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, డాక్టర్ శ్రీకాంత్, బుచ్చిబాబు, శివాజీ, శివశంకర్ తదితరులు మీడియాకు వెల్లడించారు. దాదాపుగా 7 లక్షల రూపాయల ఖర్చు అయ్యే సర్జరీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా చేయడం జరిగిందని చెప్పారు. పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.







