
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతం అయింది. ఈ సందర్భంగా జాబ్ మేళా సక్సెస్ చేసిన వారికి హిందూ ఫార్మసీ కళాశాలలో మంగళవారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ తోపాటు నిర్వహణ కమిటీ ప్రతినిధులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు, సెక్రెటరీ శిరిపురపు మధుసూదనరావు, ప్రిన్సిపాల్ నాగభూషణం, సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.కే మనోహరరావు, కోశాధికారి పులిపాక ప్రసాదరావు, జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మెగా జాబ్ మేళా ద్వారా 1500 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. గుంటూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళా స్ఫూర్తితో రాష్ట్రం అంతటా జాబ్ మేళాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని వారు వెల్లడించారు.







