
జాతీయ స్థాయి వాటర్ షెడ్ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి అధికారులతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు. పత్తిపాడు నియోజకవర్గంలోని వెంగలాయపాలెం చెరువు, వాటర్ షెడ్ పునరుద్ధాన కార్యక్రమంలో పైలెట్ ప్రాజెక్ట్ గా అభివృద్ధి అవుతోంది. 11వ తేదీన జరగబోయే జాతీయ వాటర్ షెడ్ మహోత్సవంలో భాగంగా, ఈ చెరువును దేశానికి అంకితం చేయబోతున్నాం. ఈ చెరువును పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని కేవలం 15 రోజుల్లో ఈ స్థాయిలో పనులు పూర్తి చేయించా. మన దేశ అభివృద్ధి నీటి నిర్వహణపై ఆధారపడింది. వర్షం వచ్చినప్పుడే ఆ నీటిని సేకరించి, నిల్వ చేయాలి, సద్వినియోగం చేయాలి. వాటర్ షెడ్ అంటే చెక్‌డ్యామ్ కాదు, ఇది గ్రామీణ భారత పునర్నిర్మాణానికి బలమైన Eco Foundation.ఇది భూగర్భజలాలను పెంచుతుంది, రైతుల పంట ఆదాయం పెరుగుతుంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది, రెండో పంట చేసే అవకాశం పెరుగుతుందని ఆయన వెల్లడించారు.







