
గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతంలో 19 ఆర్.ఓ ప్లాంట్ లు తాత్కాలికంగా సీజ్ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్ తెలిపారు. బుధవారం తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామ పంచాయతీ, గుడివాడ గ్రామ పంచాయతీ, తుళ్ళూరు మండలం అనంతవరం, తుళ్ళూరు, లింగయపాలెంలలో విస్గతృతంగా తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని మొత్తం 19 ఆర్.ఓ ప్లాంట్ లను తాత్కాలికంగా సీజ్ చేసి నోటీసులు జారీ చేయడం జరిగిందని వివరించారు.







