
గుంటూరులోని జిల్లా కోర్టు ఎదురు నూతనంగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై న్యాయ దేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా కోర్టు వద్ద న్యాయ దేవత విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని జిల్లా జడ్జి తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక ప్రణాళికలతో గుంటూరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. అందరౄ సహకారంతో నగర సుందరీకరణ కోసం పని చేస్తామన్నారు.







