
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీస్ అధికారులు, సిబ్బందిసమగ్ర పహరా చర్యలు చేపడుతున్నారు. మారుమూల గ్రామాలలో ఉన్న వాగులు, కాలువలు, చెరువులు, కుంటలను డ్రోన్ల ద్వారా పరిశీలన చేస్తున్నారు.కాలువలు చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉంటే లేదా గండ్లు పడే అవకాశం ఉంటే ముందస్తు జాగ్రత్త చర్యలు భాగంగా అక్కడ కట్టలు బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల నీటి మట్టం పెరుగుదల పరిస్థితులను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించడం. ప్రమాద సూచనలపై తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గుంటూరు నగరం మరియు ఇతర పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసి డ్రైనేజ్ పొంగే ప్రదేశాలు గుర్తించడం జరిగింది. ప్రజలు సురక్షితంగా ఉండేలా వాగులు, కాలువలు, చెరువుల సమీపంలో ఉన్న కాలనీలకు హెచ్చరికలు జారీ చేయడం, రాకపోకలకు తాత్కాలిక పరిమితులు విధించారు. వర్షం, వరద పరిస్థితుల్లో రోడ్ల స్థితిని డ్రోన్ల ద్వారా పర్యవేక్షించి ట్రాఫిక్ డైవర్షన్‌లను ముందుగానే అమలు చేశారు.







