
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (మెగా పి.టి.యం) జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలలు, కళాశాలల్లో శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహిండం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. మెగా పి.టి.యంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణంలో తల్లిదండ్రులతో సమావేశం జరుగుతుందన్నారు. మెగా పి.టి.యం 3.0 ను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఇద్దరు పాల్గొనాలని కోరారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, ఇతర ప్రజాప్రతినిధులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలో చేపట్టుతున్న కార్యక్రమాలు – ఉపాధ్యాయులు ప్రగతి నివేదన పత్రం (HPC) ను తల్లిదండ్రులకి ఇచ్చి విద్యార్థి ప్రగతిని వివరిస్తారని, ప్రభుత్వము కొత్తగా ప్రవేశపెట్టిన అసెస్మెంట్ పుస్తకాలలో నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక పరీక్షల పుస్తకాలను తల్లిదండ్రులకు పరిశీలనా నిమిత్తం ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థుల మార్కులను తల్లిదండ్రులు వారి మొబైల్ లో లీప్ యాప్ ద్వారా ఎలా చూడవచ్చునో తెలియజేస్తారన్నారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను సమావేశంలో తెలియజేస్తారని, పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సంసిద్ధతకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న 100 రోజులు కార్యక్రమం వివరాలను తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరిస్తారని చెప్పారు. పాఠశాల కమిటీ సభ్యులు, అతిథులు, దాతలు పాఠశాల ప్రగతికి చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చిస్తారని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని అందరూ స్వీకరించిన తరువాత కార్యక్రమం ముగుస్తుందన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ఉదయం 11 గంటల వరకు చర్చిస్తారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ పాల్గొని విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి, పాఠశాల పురోగతికి తగిన సలహాలు, సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవితను తీర్చిదిద్దుటకు ఒక గొప్ప కార్యక్రమం అన్నారు. జిల్లాలో విజయవంతంగా నిర్వహించే ఆదర్శంగా నిలవాలని అన్నారు. తల్లిదండ్రులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఇరవై సూత్రాల కార్యక్రమల అమలు ( స్వర్ణాంధ్ర – వికాసిత్ భారత్) ఛైర్మన్ లంకా దినకర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి పాల్గొన్నారు.







