Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: పి.జి.ఆర్.ఎస్ కు 409 వినతులు

PUBLIC GREEVENCE IN GUNTUR

:ప్రజా సమస్యల పరిష్కార వేదిక  (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమానికి 409 వినతులు అందాయి. పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గల ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సోమవారం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి తదితరులతో కలసి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సంతృప్తి మేరకు ఆర్జీల పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతీ ఆర్జీని పక్కాగా వి*పి.జి.ఆర్.ఎస్ లో అందిన కొన్ని ఆర్జీల వివరాలు** గుంటూరు నగరంలో ఉన్న రత్నాపూర్ కాలనీకి కనీస మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. చిన్నపాటి వర్షం కురిసినా నివసించే పరిస్థితి లేదని చెప్పారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో సర్వే నెం. 608లో ప్రభుత్వ భూమిలో మేజరు చెరువు ఉందని, ఈ చెరువుకు ప్రతి సంవత్సరం బహిరంగ వేలం పాట నిర్వహించాలని, పంచాయతీ ఆదాయం పెంచడమే కాకుండా ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన గంపల నాగరాజు ఆర్జీని సమర్పించారు. పెదనందిపాడు మండలం గొరిజవోలుగుంట పాలెం గ్రామంలో  428/ఏ సర్వే నంబరులో 0.68 సెంట్ల భూమిని సర్వే చేసి అడంగల్  లో నమోదు చేయాలని, దీర్ఘకాలంగా అర్జీలు సమర్పిస్తున్నా పరిష్కారం చేయడం లేదని పత్తిపాడు గ్రామానికి చెందిన షేక్ ముక్తు సాహెబ్ కోరారు. రెవెన్యూ రికార్డు 1బి ఆడంగల్ లో  అదే సర్వే నెంబర్ లో వేరే వారి పేరు ఉందని,  సర్వే చేయడం కుదరదని తహసిల్దార్ కార్యాలయం అధికారులు తెలియజేసి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దస్తావేజులు, పాసు పుస్తకములు నా పేరు మీద ఉన్నాయని న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు అర్జీ అందించారు. నాకు షుగర్ వ్యాధి వల్ల 2023 సంవత్సరంలో ఒక కాలు తొలగించారని, సదరం సర్టిఫికెట్ తీసుకొని దివ్యాంగుల పెన్షన్ కోసం 2024లో వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసి ఉన్నానని, ఇప్పటి వరకు నాకు పెన్షన్ మంజూరు కాలేదని గుంటూరు ఆదర్శనగర్ కు చెందిన సానికొమ్ము కొండారెడ్డి కోరారు. జీవనోపాధికి తీవ్ర ఇబ్బందిగా ఉందని, పెన్షన్  మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.  నాకు 75 సంవత్సరాలు, బ్రహ్మానందపురంలో ఉన్న రెండు సెంట్లు స్థలంలో కొంత భాగంలో ఇల్లు నిర్మించుకొని కొడుకుతో కలిసి ఉంటున్నానని, అయితే కొడుకు కోడలు నన్ను సరిగా పట్టించుకోవడంతో కుమార్తె వద్ద ఉంటున్నానని మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి బ్రహ్మానందపురంలో నివసిస్తున్న సిరిపల్లె అంకమ్మ తెలిపారు. నా కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సంభవించిన తుఫాను, వరదల కారణంగా జిల్లా వ్యాపితంగా వేలాది ఎకరాలలో వరి, ప్రత్తి, మిర్చి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని, రైతాంగం దిక్కుతోచని స్థితిలో వున్నారని, దీనికి తోడు నల్లమడ డ్రైన్ పొంగి, కట్టతెగి పెదనందిపాడు, ప్రత్తిపాడు, కాకుమాను మండలాలలో వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని రైతు, కౌలు రైతుల సంఘం ఆర్జీని సమర్పించింది. గతంలో వరి రెండు సార్లు ఎదపెట్టారు. ఇప్పటికే కౌలుకాక వరికి 25వేలు, ప్రత్తికి 30వేలు, మిర్చికి షుమారు 40వేలు ఖర్చు చేశారు. ఈ స్థితిలో నష్టపోయిన రైతులు, కౌలు రైతులు,  నష్టపరిహారం, అన్నదాత సుఖీభవ కౌలురైతులకు వర్తింప చేయాలని జిల్లా కలెక్టర్ కు అర్జీ అందించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ లు విజయ లక్ష్మి, గంగరాజు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వర రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.శ్రీనివాస్, జిల్లా విద్యా శాఖ అధికారి సి.వి. రేణుక, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి జె.పద్మ, ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button