
పేద ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించడంలో దక్షిణ భారతదేశంలో ప్రథమ బ్యాంకు విశాఖపట్నం కో-ఆపరేటివ్ అని బ్యాంకు డైరెక్టర్ పి.వి మల్లికార్జునరావు, చుక్కలపల్లి రామారావు, చిన్నం కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఏటుకూరు రోడ్డులో గల ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ వన్ టౌన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సహకార సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పి.వి మల్లికార్జునరావు, చుక్కలపల్లి రామారావు, చిన్నం కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ బ్యాంకు సభ్యులకు ఆర్థిక లావాదేవీలు జరుపుకునే సౌకర్యంతో పాటు సాకార సూత్రాలు, సహకార విలువలకు ప్రాధాన్యత ఇస్తూ సభ్యుల సంక్షేమానికి చేయూత ఇస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల సాకార సంఘాలు ఉన్నాయని, వీటిలో సుమారు 100 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. సహకార సూత్రాలు స్వేచ్ఛ పూరిత స్వేచ్ఛ సౌలభ్యం, ప్రజాస్వామ్య నియంత్రణ, ఆర్థిక భాగస్వామ్యం స్వయం ప్రతిపత్తి విద్య, శిక్షణ, సమాచారం సహకార సంఘాల మధ్య సమన్వయం సమాజ శ్రేయస్సు ఈ ఏడు సూత్రాలు పూర్తిస్థాయిలో పాటించే సహకార సంస్థల్లో ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ ఎం. ఎర్రంరెడ్డి, బ్యాంకు మేనేజర్ ఎస్. శివనారాయణ, బుల్లి కుమార్, బ్యాంక్ సిబ్బంది సతీష్ కుమార్, పులి శిరీష, పి. నాగలక్ష్మి, ఎస్కే, షఫీ, ముకుంద, శివ, అనిల్, ప్రసాద్, కమిటీ సభ్యులు జి. రాఘవేంద్రరావు, టి. నాగేశ్వరరావు మరియు బ్యాంకు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సహకార సదస్సుల భాగంగా అతి తక్కువ వడ్డీతో లోన్స్ పొందిన ఖాతాదారులకు చెక్కులను అందజేశారు.







