
మంగళగిరిలోని ఆరవ పోలీస్ బెటాలియన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 16వ తేదీన పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించే కార్యక్రమంలో పాల్గొననున్నందున అక్కడి ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్, డీఐజీ సత్యేష్ బాబు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలిసి పరిశీలించారు.
Horoscopeసభా వేదిక ఏర్పాటు చేసే స్థలాలు, ఇతర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు జిల్లా కలెక్టర్ సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ ఎస్పి నాగేష్ బాబు, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీనివాసమూర్తి, ఎంటీఎంసీ కమిషనర్ ఆలీం భాష , మంగళగిరి తహశీల్దార్ దినేష్ రాఘవేంద్ర, తదితర అధికారులు పాల్గొన్నారు.







