
రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ తిరుపతిరావు, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తాడువాయి రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెలగేటి గంగాధర్ గురువారం మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే వాటిని గత ప్రభుత్వం సకాలంలో వినియోగించలేక పోయిందని చెప్పారు. మెడికల్ కళాశాలలను పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ఎవరూ అపోహలకు గురికావద్దని సూచించారు. వైసీపీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. మెడికల్ కాలేజీల పీ.పీ.పీ విధానంలో విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.







