
చంద్రబాబు, లోకేష్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. పీపీపీ పేరుతో మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారని విమర్శించారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ఎంత దారుణమో ఇది స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఇప్పటికే కోస్తా జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో మంచానికి ఇద్దరు–ముగ్గురు పేషెంట్లు చేరే పరిస్థితి ఉండగా, ప్రైవేట్‌కు ఇస్తే అవి వ్యాపార కేంద్రాలుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రజావ్యతిరేక విధానాన్ని అడ్డుకునేందుకు రాబోయే రోజుల్లో సిపిఐ అన్ని పార్టీలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని అజయ్ కుమార్ పేర్కొన్నారు.







