
మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి చేపట్టిన ఆందోళన తుది దశకు చేరుకుతుంది. ఇందులో భాగంగా సంతకాల సేకరణ పత్రాలను తాడేపల్లి లోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేర్చారు. ఈ సందర్భంగా సోమవారం వైసీపీ శ్రేణులు నగరంలో భారీ ప్రదర్శన చేపట్టాయి. జిల్లా వైసీపీ కార్యాలయం నుండి ప్రదర్శనగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవాలని సంతకాల సేకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జిల్లాలో 4 లక్షల 70 వేల మంది వరకు సంతకాలు చేశారని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని ఆయన వెల్లడించారు. ఉద్యమాలను మరింత ఉధృతం చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, జిల్లా ఇన్చార్జి పోతిన మహేష్, 7 నియోజకవర్గాలకు చెందిన సమన్వయకర్తలు పాల్గొన్నారు.







