Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: మోటార్ వాహనాలకు దివ్యాంగుల నుండి దరఖాస్తులు ఆహ్వానం

IMPORTANT UPDATE FOR DISABLE PERSONS

దివ్యాంగులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాలు (మూడు చక్రాల మోటార్ వాహనాలు) మంజూరుకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు డి దుర్గా భాయి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల స్వతంత్ర చలనశీలత, ఆత్మ నిర్భరత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించుటకు అర్హులైన లోకో మోటార్ దివ్యాంగులకు శత శాతం సబ్సీడీతో రెట్రోఫిట్టిడ్ మోటరైజ్డ్ వాహనాల మంజూరు పథకం కింద ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోందన్నారు. ఈ పథకం క్రింద ఈ నెల 25వ తేదీ నాటికి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. ఒకటి లేదా రెండు కింద భాగాలు (లోయర్ లింట్స్) ప్రభావితమై 70% లేదా అంతకంటే ఎక్కువ లోకో మోటార్ వికలాంగత ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షలు కంటే ఎక్కువ ఉండకూడదు. అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. వాహనం నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంతకుముందు ఏ మోటరైజ్డ్ వాహనాన్ని పొంది ఉండరాదు లేదా తన పేరుపై వాహనం ఉండకూడదు. ఈ ప్రయోజనం జీవితంలో ఒక్కసారి మాత్రమే పొందగలరు. సహాయ ఉపకరణములుతో నడవని వారు అర్హులు కారు. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే పై స్థాయి కోర్సులు రెగ్యులర్ పద్ధతిలో చదువుతున్న విద్యార్ధులై ఉండాలి. స్వయం ఉపాధి, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు లేదా కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న జీతం/వేతనం ఉద్యోగులు (కనీసం 10వ తరగతి విద్యార్హతతో). అర్హులైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులు & వృద్ధుల సహాయ సంస్థ (APDASCAC) అధికారిక వెబ్సైట్ లో www.apdascac.ap.gov.in ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తులు పరిశీలిన జరుగుతుంది. ఈ కమిటీకి జాయింట్ కలెక్టర్ అధ్యక్షత వహిస్తారు. వాహనాల మంజూరు బడ్జెట్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది. దరఖాస్తుతో జత చేయవలసిన స్వీయ దృవీకృత పత్రాలు:1. వికలాంగుల ధృవపత్రం (SADAREM / జిల్లా వైద్య బోర్డు)2. ఆధార్ కార్డు3. ఎస్.ఎస్.సి. సర్టిఫికేట్4. కుల ధృవపత్రం (వర్తిస్తి)5. తాజా ఆదాయ ధృవపత్రం6. బోనాఫైడ్ సర్టిఫికేట్ (విద్యార్థుల కోసం) / ఉపాధి ధృవపత్రం (స్వయం ఉపాధి లేదా ఉద్యోగుల కోసం)7. పాస్పోర్ట్ సైజు ఫోటో8. ఇంతకు ముందు వాహనం పొందలేదని స్వీయ ప్రకటనఆన్లైన్ దరఖాస్తులను నవంబరు 25 లోగా సమర్పించాలి. వివరాలకు వెబ్ సైట్ లో చూడవచ్చని దుర్గాబాయి చెప్పారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button