
రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో రెవెన్యూ అంశాలు పట్ల అందిన ఆర్జీలపై నియోజక వర్గం స్థాయిలో రెవెన్యూ నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందిన ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పట్ల పూర్తి అవగాహన పొందాలన్నారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదని ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అర్జీదారునితో మాట్లాడి సమస్య పరిష్కారంకు చర్యలు తీసుకోవాలని తద్వారా మరల సమస్య వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. ముందస్తుగా అర్జీదారులకు నోటీస్ జారీ చేసి ప్రక్రియను నిబంధనలు మేరకు చేపట్టాలని అన్నారు. తహసిల్దార్ లు సోమవారం అందుకున్న అర్జీల పట్ల శుక్రవారం నాటికి స్పష్టమైన సమాచారం కలిగి ఉండాలని చెప్పారు. రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.బియ్యం కార్డు వంటి సేవా పరమైన అంశాలు వచ్చేటపుడు నేరుగా దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు సహకరించాలని సూచించారు. బియ్యం కార్డుకు వచ్చే దరఖాస్తులు పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మి కుమారి, శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.







