chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి

GUNTUR DEO VISIT GOVT SCHOOLS

వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా  అన్నారు. గుంటూరు గ్రామీణ మండలం లాల్పురం, పుట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, పుట్టూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలలలో 10వ తరగతి వంద రోజుల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేకంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. సబ్జెక్టుల వారీగా సమీక్షించారు. ఉపాధ్యాయులు అందరూ ప్రత్యేక శ్రద్ధతో వంద రోజుల ప్రణాళిక అమలు చేసి పది ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. సబ్జెక్ట్ టీచర్స్ ప్రతి విద్యార్థిలో ఉన్న బలలు, బలహీనతలు గమనించి అందుకు తగిన విధంగా తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్, లెక్కలలో విద్యార్థులలో ఉన్న భయాన్ని పోగొట్టాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులకు పదవ తరగతి అత్యంత కీలక దశ అని, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలన్నారు. *గణిత ఉపాధ్యాయునికి అభినందన*లాల్పురం జిల్లా పరిషత్ హై స్కూల్ లో గణిత బోధన చేస్తున్న ఉపాధ్యాయుడులూర్దయ్యకు జిల్లా విద్యా శాఖ అధికారి ప్రత్యేకంగా అభినందించారు. గణిత ఉపాధ్యాయుడు 10వ తరగతి గణిత అభ్యాసాలకు సంబంధించిన సామర్థ్యాలను ప్రతి అధ్యాయానికి అనుగుణంగా డిస్‌ప్లే చార్ట్స్ రూపంలో రూపొందించడం, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా గణితాన్ని బోధించడం అద్భుతంగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశంసించారు. గణిత ఉపాధ్యాయుని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి అబ్దుల్ ఖుద్దూస్, సి.ఆర్.పి  శ్రీమతి అంజి బాయి పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker