
రెండు రోజుల పాటు జరగనున్న వాటర్ షెడ్ మహోత్సవ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పరిశీలించారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెం గ్రామ పంచాయతీలో 11వ తేదీన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సహాయమంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 130 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వాటర్ షెడ్ మహోత్సవ్ 10, 11 తేదీల్లో జిల్లాలో ఏర్పాటు చేయగా, మొదటి రోజు గుంటూరులో ఐటిసి హోటల్లో ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. రెండవ రోజు వెంగళాయపాలెంలో జరుగుతుంది. ఈమేరకు శుక్రవారం వెంగళాయపాళెం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని ఆదేశించారు.







