
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అవసరం, అలవరచుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రభుత్వ బాలుర ఉర్దూ పాఠశాలలో విద్యా శాఖ నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్) ముగింపు కార్యక్రమంలో సోమవారం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, సైన్స్ మీద ఆసక్తి పెరుగుటకు సైన్స్ ఫెయిర్ లు ఉపయోగపడతాయన్నారు. ఒక అంశం పట్ల స్పష్టమైన నిర్దారణ అవసరమని అందుకు శాస్త్రీయ దృక్పథం తోడ్పడుతుందని చెప్పారు. ఉన్నత స్థాయికి వెళ్ళుటకు, పోటీ పరీక్షలలో విజయం సాధించుటకు, శాస్త్రవేత్తగా రాణించుటకు శాస్త్రీయ దృక్పథం అవసరాన్ని స్పష్టం చేశారు. శాస్త్రీయ దృక్పథం ఉన్నవారు నిజ జీవితంలో బాగా రాణిస్తారని పేర్కొన్నారు. సైన్స్ ఫెయిర్ ఇటువంటి అభిరుచి ఉన్నవారికి మంచి అవకాశం అన్నారు. ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహిస్తున్నారని అభినందించారు. “మీ పిల్లులు గెలుపు .. మీకు ఎంతో సంతోషం కలిగిస్తుందని” ఇదే ప్రోత్సాహం, స్పూర్తి కలిగిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు గట్టి పునాదులు వేయాలని కోరారు. విద్యారంగంలో ప్రభుత్వం మంచి సంస్కరణలు తీసుకు వస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్పాఠశాలలు కంటే బాగా ఉన్నాయని అన్నారు. ఫౌండేషన్ స్థాయిలో చదవడం, రాయడం, అర్ధంచేసుకోవడం అంశాల్లో సర్వే జరుగుతోందని వివరించారు. విద్యార్థుల సమగ్ర అభ్యసన స్థాయిలను నమోదు చేస్తూ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు లను అందించడం జరుగుతుందని చెప్పారు. సమ్మెటివ్, ఫార్మాటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. *ఉన్నత పాఠశాలలకు ప్రత్యేక అధికారులు*ఉన్నత పాఠశాలలకు ప్రత్యేక అధికారులను నియమించామని జిల్లా కలెక్టర్ చెప్పారు. పదవ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని దృష్టి సారించమని అన్నారు. ఇప్పటి నుండే సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్నామని చెప్పారు. 185 ఉన్నత పాఠశాలలకు “మన బడి – మన బాధ్యత” (మన స్కూల్ – మన బాధ్యత) కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టి విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచుటతో పాటు ఉన్నత అవకాశాలు పట్ల అవగాహన కల్పించుటకు సంకల్పించామని అన్నారు. *విద్యార్థులూ.. లక్ష్యాలను ఏర్పరచుకోండి*విద్యార్థులు లక్ష్యాలను పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. లక్ష్యాలు ఉండాలని వాటిని సాధించుటకు గట్టిగా కృషి చేయాలని కోరారు. జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా మాట్లాడుతూ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థి, ఉపాధ్యాయ వ్యక్తిగత మరియు బృందాల వారీగా నిర్వహించామన్నారు.ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.







