
వెంగళయపాలెంలో మోడల్ అమృత్ సరోవర్ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు. గుంటూరు రూరల్ మండలం వెంగళయపాలెం ఊర చెరువును మోడల్ అమృత్ సరోవర్ అభివృద్ధి పనుల కింద చేపట్టారు. ఈ నెల 11వ తేదీన వెంగళయపాలెంలో జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమాన్ని నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పరిశీలించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి శాఖకు చెందిన అదనపు కమిషనర్ సి.పి రెడ్డి, సంచాలకులు వై.వి.కె. షణ్ముఖ కుమార్, ఎం.శివ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, డిప్యూటీ ఎంపిడిఓ శ్రీనివాస్, సర్పంచ్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.







