Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: వెంగళాయపాలెం గ్రామ చెరువును పరిశీలించిన కేంద్ర మంత్రి

CENTRAL MISTER PEMMASANI VISIT WATER TANK

వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఆక్టివిటీలో భాగంగా గుంటూరు రూరల్ మండలం వెంగళాయ పాలెం గ్రామ చెరువును గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులుతో కలిసి పరిశీలించారు. పరిశీలన అనంతరం 11వ తేదీన నిర్వహించబోయే వాటర్షెడ్ జాతీయ కార్యక్రమానికి సంబంధించిన సభా ప్రాంగణ ఏర్పాట్లను పెమ్మసాని గారు పరిశీలించారు. సభ ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన వాటర్ షెడ్ పథకాన్ని డ్రాట్ ఎక్కడ ఉందో అక్కడ భూగర్భ జలాలు పెంచే విధంగా చర్యలు చేపడుతున్నాము. అయితే ఈ పథకాన్ని గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో అవకాశం లేక గ్రామీణ ప్రాంతంలో ఉన్న వెంగలాయపాలెం చెరువును ఎంపిక చేశాము. ఒక సమగ్రమైన వాట్ కింగ్ ట్రాక్, కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నాము. రూ. 1.2 కోట్లు ఖర్చు చేసి ఒక ఎంట్రన్స్ ప్లాజా, పార్కింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, పిల్లల ఆటస్థలం, కమ్యూనిటీ గెదర్ ఏరియా, గెజిబో వంటి అన్ని సౌకర్యాలను కల్పించి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నాము. అయితే ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు బాధ్యత తీసుకొని దీని నిర్వహించుకునేలా చర్యలు చేపడుతున్నాము. ఇందుకుగాను 300 కొబ్బరి చెట్లు, ఫిషెస్ పెంపకం ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాము. ఒక పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు 10 – 11వ తేదీలలో గుంటూరులో నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ ను నిర్వహించబోతున్నాము. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు అధికారులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ఈ పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ద్వారా మన గుంటూరు జిల్లాలో మరిన్ని గ్రామాలకు నిధులు సేకరించి మోడల్ విలేజెస్ గా రూపొందించాలని ప్రయత్నిస్తున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని 10 రోజుల్లో యుద్ధప్రాతిపదికన ఎమ్మెల్యే బీ. రామాంజనేయులు, గ్రామీణాభివృద్ధి అధికారులు కలిసి సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి 11వ తేదీన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గహఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button