
రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు నగర, రైల్వే డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. శంకర్ విలాస్ వంతెన రైల్వే ట్రాక్ పై ఉన్న పాత వంతెన డెమోలిష్ చేసే బాధ్యత ఓ ఏజెన్సీకి అప్పగించారు. దీనికి 6 రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. ప్లైఓవర్ కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ వేగవంతం చేస్తాం. నందివెలుగు పై వంతెన పనులు పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభిస్తాం. పలకలూరు, ఇన్నర్ రింగ్ రోడ్ ROB పనులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రారంభం. గుంటూరు శ్యామలా నగర్ వద్ద ROB కి చాలా నిర్మాణాలు తొలగించాలి. దీనిపై యజమానులతో మాట్లాడాలి. గుంటూరు శివారులోని మొండిగేటు వద్ద డ్రెయిన్లు కోసం రూ. 6 కోట్లతో పనులు. గుంటూరు రైల్వే స్టేషన్ లో అండర్ పాస్ లోకి వర్షపు నీరు రాకుండా చర్యలు. తెనాలిలో వందేబారత్ రైళ్లు ఆపాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అడిగారు. అధికారులు సానుకూలంగా స్పందించారు. శ్యామల నగర్ ఆర్ఓబి నిర్మాణానికి భూసేకరణ జరిగిన తర్వాతనే పనులు ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, కమిషనర్ పులి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ సందీప్ జైన్, గుంటూరు డివిజన్ రైల్వే చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ కె. సైమన్, ఏ.డి.ఆర్.ఎం కె. రమేష్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ పి.వి.రమణ రావు, శ్రీధర్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ కె.శ్రీనివాస్, రహదారులు భవనాలు శాఖ అధికారి శ్రీనివాస మూర్తి, ముఖ్య ప్రణాళిక అధికారి శేషశ్రీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.







