
గుంటూరు వికాస్‌నగర్‌లో నివసిస్తున్న శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావుని ప్రముఖ వ్యాపారవేత్త, ఆంధ్ర రత్న – సామాజిక సేవా రత్న అవార్డు గ్రహీత, నేతాజీ మిత్రమండలి ఛైర్మన్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానంలో సాధారణ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు BSR చేస్తున్న కృషి అపారమని ఆయన కొనియాడారు. అలాగే శ్రీశైలం దేవస్థానం బోర్డులో గుంటూరు ప్రాంతానికి ప్రాతినిధ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా BSR ని ప్రత్యేకంగా సత్కరించి అభినందనలు అందజేశారు.







