
సేవా దృక్పథానికి ఎన్.ఎస్.ఎస్ గొప్ప అవకాశం అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్యావరణ ఇంజనీరు మహమ్మద్ నజీనా బేగం అన్నారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే సేవా దృక్పథం అలవడాలని, తద్వారా భవిష్యత్తులో ఉన్నత ఆలోచనలతో రాణిస్తారని చెప్పారు. ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం) గుంటూరు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్ ) యూనిట్ 1 ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం ఏటి అగ్రహారం లోని ఎస్ కే బి ఎం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. ఈ ప్రత్యేక శిబిరము నవంబర్ 27వ తేదీన మొదలై డిసెంబర్ మూడో తేదీ వరకు జరిగింది. ఈ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుంటూరు ప్రాంత పర్యావరణ ఇంజనీరు మహమ్మద్ నజీనా బేగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి .ఆర్ . జ్యోత్స్న కుమారి ప్రత్యేక శిబిరంలో భాగంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ వాలంటీర్లు ఆకులవారితోటలో చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ సమాజ సేవ రెండు ఎన్ఎస్ఎస్ కు చాలా ముఖ్యమైన బాధ్యతలుగా వారికి గుర్తు చేసి వాటిని చక్కగా నిర్వర్తించినందుకు ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీమతి సంతోష్ కుమారిని, వాలంటీర్లను అభినందించారు .ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త డి .తిరుపతి రెడ్డి, ఐటిసి ప్రాజెక్ట్ ఆఫీసర్ కె .వెంకటనారాయణ, ఎస్ కే బి ఎం ఉన్నత పాఠశాల హెచ్ఎం కాజావలి పాల్గొని వారం రోజుల ప్రత్యేక శిబిరంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.







