
మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అధికారులు హడావుడిగా పంట నష్టం అంచనా వేస్తున్నారని తెలిపారు. దీని వల్ల రైతులకు నష్టం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో మొత్తం 70 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి పంట నష్టం అంచనా సమగ్రంగా వేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పత్తి, వరికి రూ. 25 వేలు, అపరాలకు రూ.10, ఉద్యానవన పంటలకు 50 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.







