
మంగళగిరి మండలంలోని 13 పాఠశాలలకు రూ.33 లక్షల విలువైన సామగ్రిని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) క్రింద అందించింది. ఈ సామగ్రిలో ఫర్నిచర్, క్రీడా సామగ్రి, వంట సామగ్రి ఉన్నాయి. మొత్తం 13 పాఠశాలల్లో ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒక మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల (ఎం.పి.యు.పి)., ఐదు మున్సిపల్ ఉన్నత పాఠశాలలు, రెండు మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కృష్ణయ్య పాలెం ఎం.పి.యు.పి పాఠశాల., నౌలురు, చినకాకాని, ఆత్మకూరు, పెదవద్దపూడి, నూతక్కి జెడ్పీ.హెచ్.ఎస్ లు., కండ్రుకమల, పాత బ్యాంకు కాలనీ, మంగళగిరి వీవర్స్ కాలనీ, బిఆర్ నగర్, పాత మంగళగిరి, జి రోడ్డులో గల మునిసిపల్ పాఠశాలలకు అందజేశారు. అందజేసిన సామగ్రిలో 124 చొప్పున బెంచీలు, డెస్క్ లు., ఉపాధ్యాయులకు 65 కుర్చీలు, రివాల్వింగ్ చైర్ లు 68, ప్రధాన ఉపాధ్యాయులకు 8 టేబుల్స్, అల్మరా లాకర్లు 10, అల్మరాలు 20, గ్లాస్ తలుపులు గల అల్మరాలు 8, గ్రంథాలయంలో చదువుటకు ఉపయోగించే టేబుల్స్ 2, ప్లాస్టిక్ చైర్ లు 265, పోడియంలు 13, వాలి బాల్ లు 31, వాలి బాల్ నెట్ లు 25, త్రో బాల్ లు 33, టెన్ని కోయిట్ రింగ్ లు 21, చెస్ బోర్డులు 23, చెస్ ప్యాన్స్ 23, షటిల్ కాక్ లు 30, షటిల్ రాకెట్ లు 30, షటిల్ నెట్ లు 21, క్యారం బోర్డ్ 21, క్యారం బోర్డు కాయిన్ లు 20, క్యారం బోర్డు పౌడర్ లు 12, ఫుట్ బాల్ లు 27, టెన్నిస్ బ్యాట్ లు 29, టెన్నిస్ బాల్స్ 28, క్రికెట్ స్టంప్స్ 37, స్కిప్పింగ్ రోప్స్ 21, హ్యాండ్ పంపులు 21, స్టవ్ లు 9, కుక్కర్ లు 9, ఆల్ టాప్ లు 18 ఉన్నాయి. ఈ సామగ్రిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సమక్షంలో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి.రేణుకకు అందజేశారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. మరిన్ని మంచి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లో కనీస అవసరాలు కల్పనలో భాగస్వామ్యం కావాలని కోరారు. తద్వారా మంచి సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు.టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ బి. నిఖిల్ మాట్లాడుతూ తమ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో కంపెనీ సి.ఎస్.ఆర్ మేనేజర్ సొప్ప ఈశ్వరరావు, పృథ్వీ టయోటా ఎం.డి పృథ్వి మలెంపాటి, ఇతర ప్రతినిధులు అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







